కొన్ని రోజులుగా ‘ఆదిపురుష’ సినిమా చుట్టూ వివాదాలు, విమర్శలు వస్తున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ పౌరాణిక చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ చాలా దారుణంగా ఉన్నాయని నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసిందనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి.

ఆదిపురుషంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ సినిమాను బ్యాన్ చేయాలనే ట్రెండ్ సోషల్ మీడియాలో సాగింది. ఈ క్రమంలో కొందరు ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారని.. దీనిపై విచారణ జరిపి ప్రభాస్‌కు, మేకర్స్‌కి నోటీసులు జారీ చేశారని వార్తలు వచ్చాయి.

హిందువుల ఆధ్యాత్మిక మనోభావాలను దెబ్బతీసినందుకు వ్యతిరేకంగా “ఆదిపురుష్” చిత్ర నిర్మాత మరియు కళాకారులపై క్రిమినల్ చర్య కోసం లీగల్ నోటీసు పంపబడింది. నేషనల్ సినీ వర్కర్ యూనియన్ (NCWU) తరపున హైకోర్టు న్యాయవాది ఆశిష్ రాయ్ లీగల్ నోటీసు పంపారు.

చిత్ర నిర్మాత ఓం రౌత్, భూషణ్ కుమార్ టి-సిరీస్, నటుడు సైఫ్ అలీ ఖాన్, నటుడు ప్రభాస్ మరియు నటి కృతి సనన్‌లకు లీగల్ నోటీసు పంపబడింది. నిర్మాతలు, కళాకారులు హిందూ మతాన్ని అవమానించారని నోటీసు కింద పేర్కొన్నారు.

ఇది సినిమాకు తీవ్రమైన సమస్యగా భావించాలి. లీగల్ నోటీసుపై టీమ్ ఇంకా స్పందించలేదు.

ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైన టీజర్‌కు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, థియేటర్లలో ప్రదర్శించిన 3డి టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే రాముడు – హనుమంతుడు – రావణుడి పాత్రల చిత్రీకరణపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఆదిపురుష్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. మరి అప్పటి వరకు ఈ సినిమాపై ఉన్న వివాదాలన్నీ సద్దుమణుగతాయో లేదో వేచి చూద్దాం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *