సర్దార్ మూవీ ట్విట్టర్ రివ్యూ: కార్తీ నటన కోసం తప్పక చూడాల్సిన సినిమా!
సర్దార్ మూవీ ట్విట్టర్ రివ్యూ: కార్తీ నటన కోసం తప్పక చూడాల్సిన సినిమా!

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ సినిమాలకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోకి డబ్ అవుతుంది. ‘యుగకి ఒకడు’ ‘ఆవారా’ ‘నా పరమ శివ’ ‘ఊపిరి’ ‘ఖాకీ’, ‘ఖైదీ’ వంటి హిట్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్ గా హిట్ అయిన ‘పొన్నియన్ సెల్వన్-1’ సినిమాలో కూడా నటించాడు. ఆ సినిమా తెలుగులో కూడా కమర్షియల్ హిట్ అయింది.

g-ప్రకటన

కార్తీ నుంచి తక్కువ గ్యాప్‌లో వస్తున్న మరో చిత్రం ‘సర్దార్‌’. అభిమన్యుడు ఫేమ్ పీఎస్ మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌ లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, రజిషా విజయన్‌ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా కింగ్ అక్కినేని నాగార్జున విడుదల చేయనున్నారు. అలనాటి స్టార్ హీరోయిన్ లైలా 16 ఏళ్ల తర్వాత ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. వారి రివ్యూ ప్రకారం ఫస్ట్ హాఫ్ బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా అలరిస్తుందని తేలింది.

సెకండాఫ్‌లో యాక్షన్‌ డోస్‌ ఎక్కువగా ఉందని… క్లైమాక్స్‌ కూడా అంతేనని అంటున్నారు. కార్తీ నటన కోసం ఒక్కసారి ఈ సినిమా చూడొచ్చు అంటున్నారు అందరూ. మరి మార్నింగ్ షోలు ముగిసిన తర్వాత ఎలాంటి టాక్ బయటకు వస్తుందో చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *