అల్లూరి 1వ వారం కలెక్షన్స్
అల్లూరి 1వ వారం కలెక్షన్స్

శ్రీవిష్ణు హీరోగా గతంలో వచ్చిన ‘అర్జున ఫాల్గుణ’, ‘భల తందానా’ వంటి చిత్రాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈసారి హిట్ కొట్టాలని ‘అల్లూరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో. ప్రదీప్ వర్మ దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఈ చిత్రాన్ని ‘లక్కీ మీడియా’ బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించగా, బెక్కెం బబిత సమర్పకులుగా వ్యవహరించారు. సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూలను అందుకుంది.

g-ప్రకటన

ఫస్ట్ వీకెండ్ డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. కానీ వారం రోజులుగా ఈ సినిమా పెద్దగా ఆడలేదు. మొదటి వారం కలెక్షన్లను ఒకసారి పరిశీలిస్తే:

నైజాం 0.33 కోట్లు
సీడెడ్ 0.18 కోట్లు
ఉత్తరాంధ్ర 0.19 కోట్లు
తూర్పు 0.11 కోట్లు
వెస్ట్ 0.07 కోట్లు
గుంటూరు 0.12 కోట్లు
కృష్ణా 0.14 కోట్లు
నెల్లూరు 0.06 కోట్లు
AP + తెలంగాణ (మొత్తం) 1.20 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 0.24 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా (మొత్తం) 1.44 కోట్లు
‘అల్లూరి’ థియేట్రికల్ బిజినెస్ రూ.3.42 కోట్లు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.3.7 కోట్ల షేర్ రాబట్టాలి. మొదటి వారం ముగిసే సమయానికి ఈ సినిమా రూ.1.44 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ.2.27 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంది. ఈ సినిమా మొదటి వారంలో అస్సలు క్యాష్ చేసుకోలేకపోయింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కష్టమనే చెప్పాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *