రజనీకాంత్ హీరోగా నటించిన కబాలి, కాలా సినిమాలతో కోలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు పా రంజిత్. రీసెంట్ గా హీరో విక్రమ్ (చియాన్ విక్రమ్)తో సినిమా చేయడానికి జతకట్టాడు. కొన్ని నెలల క్రితమే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు.

దర్శకుడు పా రంజిత్‌కు కోలీవుడ్‌లో ప్రత్యేక శైలి ఉంది, అతను అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తూ సినిమాలు తీస్తాడు. మద్రాస్ సినిమాతో దర్శకుడిగా వెలుగులోకి వచ్చిన పా రంజిత్ ఆ తర్వాత రజనీకాంత్‌తో కబాలి, కాలా సినిమాలు చేశాడు. రజనీ ఇమేజ్‌కి భిన్నమైన కథలతో రూపొందిన ఈ చిత్రాలు తమిళ చిత్రసీమలో నవయుగ చిత్రాలకు ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచాయి.

పైన చెప్పినట్లుగా రీసెంట్ గా కోలీవుడ్ టాప్ హీరో విక్రమ్ తో సినిమా కమిట్ అయ్యాడు. ఈరోజు టెస్ట్ షూట్ జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 14న ప్రారంభం కానుంది. తమిళ చిత్రసీమలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఇదొకటి కానుందని, 1800ల నాటి కథతో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా 3డిలో రూపొందనుందని కూడా అంటున్నారు.

ఈ సినిమాలో విక్రమ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించనున్నారు.

ప్రస్తుతం విక్రమ్ దిగ్గజ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియిన్ సెల్వన్-1 సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. పొన్యిన్ సెల్వన్-1 సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇది తమిళనాడులో ఇండస్ట్రీ హిట్‌గా మారుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *