సల్మాన్ ఖాన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్!
సల్మాన్ ఖాన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్!

టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందుతున్నాడు దేవిశ్రీప్రసాద్. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాతో దేవిశ్రీప్రసాద్ క్రేజ్ మరింత పెరిగింది. దీంతో బాలీవుడ్ దర్శకనిర్మాతలు తమ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్‌ని సంగీత దర్శకుడిగా ఎంచుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా దేవి శ్రీ ప్రసాద్ పనిని ఇష్టపడ్డాడు. అందుకే తాను నటిస్తున్న ‘కిసీ కా బాయ్ కిసీ కా జాన్’ చిత్రానికి సంగీతం అందించాల్సిందిగా దేవిశ్రీప్రసాద్ ను కోరాడు.

g-ప్రకటన

ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే భిన్నాభిప్రాయాలు రావడంతో దేవి శ్రీ ప్రసాద్ తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై దేవీశ్రీప్రసాద్ స్పందించారు. సల్మాన్ ఖాన్ సినిమాలోని అన్ని పాటలకు మ్యూజిక్ కంపోజ్ చేయమని తనను ఎవరూ అడగలేదని దేవిశ్రీప్రసాద్ అన్నారు. తనను సంప్రదించిన సమయంలో చిత్రబృందం వద్ద కొన్ని పాటలు ఉన్నాయని.. అయితే స్క్రిప్ట్ పూర్తిగా విని పాటలు అందించాలని దర్శకుడు కోరాడు. కథ చెప్పేటప్పుడు చాలా పాటలకు చోటు ఉంటుంది.

రన్ టైం పెరగడంతో పాటల సంఖ్యను తగ్గించినట్లు తెలిపారు. తనకు కూడా అదే చెప్పారని.. అయితే సల్మాన్ కోసం ఓ క్రేజీ సాంగ్ కంపోజ్ చేశాడని.. అభిమానులకు బాగా నచ్చుతుందని దేవిశ్రీప్రసాద్ అన్నారు. ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ ‘పుష్ప 2’ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. హిందీలో ‘దృశ్యం 2’, రోహిత్ శెట్టి ‘సర్కస్’ సినిమాలకు కూడా సంగీతం అందిస్తున్నాడు. సూర్య 42 ప్రాజెక్ట్ కూడా దేవిశ్రీ చేతికి వచ్చింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *