'ఏమైపోయావే' ఫస్ట్ సింగిల్ రిలీజ్... మరో 'RX100'లా ఉంటుంది..!
‘ఏమైపోయావే’ ఫస్ట్ సింగిల్ రిలీజ్… మరో ‘RX100’లా ఉంటుంది..!

రాజీవ్ సిద్ధార్థ్, భవానీ చౌదరి హీరోహీరోయిన్లుగా… శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై హరి కుమార్ నిర్మిస్తున్న చిత్రం ఏమైపోయావే. ఈ చిత్రానికి విజయ్ కుమార్ కథ అందించగా, రాజీవ్ సిద్ధార్థ్ దర్శకత్వం వహించారు. ఈ రాబోయే రొమాంటిక్ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ కోసం మేకర్స్ ఇప్పుడు అప్‌డేట్ ప్రకటించారు.

g-ప్రకటన

మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించడానికి ఈ చిత్రంలోని మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు. మరిచెడి నేనెలా అంటూ సాగే ఈ మధురమైన పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. లిరిక్స్‌ను తిరుపతి జవానా రాశారు… రామ్ చరణ్ గద్దెర్ల సంగీతం… అభయ్ జోధ్‌పుర్కర్ స్వరాలు అన్నీ కలగలిసి పాటను అందంగా మార్చాయి. ప్రేమలోని లోతును చూపిస్తూ సాగుతుంది పాట.

ఈ చిత్రానికి రామ్ చరణ్ గద్దెర్ల సంగీతం అందిస్తుండగా, శివ రాథోడ్ కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. మునేష్ ఆదిత్య ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రాజీవ్ సిద్ధార్థ్‌తో పాటు భవాని చౌదరి, భాషా, షాను, నామాల మూర్తి, సునీతా మనోహర్, మిర్చి మాధవి, మీసం సురేష్, నానాజీ ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *