ఆకట్టుకుంటున్న 'చెంచల' టైటిల్ లోగో
ఆకట్టుకుంటున్న ‘చెంచల’ టైటిల్ లోగో

యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాల్లో చాలా వాస్తవికత ఉంటుంది. ప్రజలు కూడా కొత్త కథలను ప్రోత్సహిస్తున్నారు. శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మంచి చిత్రాలను అందిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఒరేయ్ బామ్మర్ది, మై డియర్ బూతం వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నిర్మాత ఏఎన్ బాలాజీ. ప్రస్తుతం ఈ బ్యానర్ పై వరుసగా సినిమాలు నిర్మిస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

g-ప్రకటన

ఈ క్రమంలో తమ బ్యానర్ పై నిర్మిస్తున్న చెంచల సినిమా టైటిల్ లోగోను విజయ దశమి సందర్భంగా విడుదల చేశారు. కూర్గ్ ప్రాంతంలో పాము చుట్టూ జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ‘చెంచల’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ ప్రముఖ హీరోయిన్ చెంచల పాత్రలో కనిపించబోతోంది.

చెంచల జగదీష్ ఆచార్ దర్శకత్వం వహించగా, కెజెఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మరియు సుజిత్ శెట్టి సంగీతం సమకూర్చారు. రామిరెడ్డి కెమెరామెన్‌గా, వెంకీ ఎడిటర్‌గా, రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి భార్గవరామ్‌ రచయిత. డి, వనమాలి పాటలు రాస్తుండగా, చిన్ని ప్రకాష్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

చంచలమైన పాత్ర మరియు పాము మధ్య ఈ సినిమా కథ తిరుగుతుంది. చెంచల కుటుంబం ఎలా హత్యకు గురైంది.. అతడి గతం ఏంటి? పాముతో అతని సంబంధం ఏమిటి? ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాత ఏఎన్ బాలాజీ తెలిపారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఖర్చుకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత ప్రకటించారు. ప్రస్తుతం శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రభుదేవా, ఫ్లాష్ బ్యాక్, వర ఐపీఎస్, ఛేజింగ్ వంటి చిత్రాలు సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా త్వరలో విడుదల కానున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *