ఆ విషయంలో మాట నిలబెట్టుకోలేకపోతున్నాడు మెగా పవర్ స్టార్..
ఆ విషయంలో మాట నిలబెట్టుకోలేకపోతున్నాడు మెగా పవర్ స్టార్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తేజ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న రామ్ చరణ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాడు. రామ్ చరణ్ మాట నిలబెట్టుకోలేక పోయాడంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

g-ప్రకటన

గతంలో రామ్ చరణ్ సినిమాల గురించి మాట్లాడుతూ.. ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా సినిమా కలెక్షన్ల ప్రకటనపై ఓ వ్యాఖ్య చేశాడు. సినిమా మొదటి రోజు, రెండో రోజు ఈ స్థాయిలో వసూళ్లు చేసిందని పోస్టర్లు వేయడం కరెక్ట్ కాదన్నారు.

ఈ విధంగా సినిమా ప్రకటనకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేయడం వల్ల అవి పెద్ద ఎత్తున వివాదాలకు దారి తీస్తాయని అన్నారు. ఈ క్రమంలో తన బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ లో కానీ, తాను పాల్గొనే సినిమాల విషయంలో కానీ ఇలాంటి కలెక్షన్ పోస్టర్స్ రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చాడు..కానీ తాజాగా రామ్ చరణ్ ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రామ్ చరణ్ బ్యానర్ లో చిరంజీవి గాడ్ ఫాదర్ విషయంలో తప్పు.

విజయదశమి సందర్భంగా విడుదలైన గాడ్‌ఫాదర్‌ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 38 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టింది. అలాగే రెండో రోజు వరల్డ్ వైడ్ గా 31 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందంటూ పోస్టర్లు విడుదల చేసిన రామ్ చరణ్ గతంలో ఇచ్చిన మాటను గుర్తు చేస్తూ మాట నిలబెట్టుకోలేదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *