ప్రిన్స్ మూవీ ట్విట్టర్ రివ్యూ: శివకార్తికేయన్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్!
ప్రిన్స్ మూవీ ట్విట్టర్ రివ్యూ: శివకార్తికేయన్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్!

శివకార్తికేయన్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రిన్స్’. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తోంది. నారాయణ్ దాస్ నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న సినిమా విడుదల కానుంది.

g-ప్రకటన

ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. ఎంట‌ర్‌టైన‌ర్ మూవీగా శివ‌కార్తికేయ‌న్ మార్క్ ఉంద‌ని అంటున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. సినిమాలో కొన్ని వన్ లైనర్స్ చిరాకు తెప్పించినా, కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఉన్నా.. శివ కార్తికేయన్ మేనేజ్ చేశాడని సినిమా చూసినవాళ్లు అంటున్నారు.

ఈ దీపావళికి ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది అని కూడా అంటున్నారు. డాక్టర్, కాలేజ్ డాన్ చిత్రాల తర్వాత ప్రిన్స్‌తో కలిసి శివ కార్తికేయన్ హ్యాట్రిక్ కొట్టాడని అందరూ అంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *