
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. దిల్ రాజు బ్యానర్లో 50వ సినిమా కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీశారు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రతిభ ఉన్న నటీనటులతో పాటు పేరున్న టెక్నీషియన్స్‌ని తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
g-ప్రకటన
నవంబర్ మొదటి వారంలో న్యూజిలాండ్‌లో ఈ సినిమా షెడ్యూల్‌ను చిత్రీకరించనున్నారు. ఈ షూటింగ్లో రామ్ చరణ్, కియారా అద్వానీ పాల్గొన్నారు. వీరిద్దరిపై ఓ పాట చిత్రీకరించనున్నారు. దాదాపు పది రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించనున్నారు. ఒక్క పాట కోసం రోజంతా షూటింగ్ చేయడం మామూలు విషయం కాదు. దర్శకుడు శంకర్ తన సినిమాల్లో పాటలు ఎంత గ్రాండ్ గా ఉంటాయో తెలిసిందే.
‘రోబో’, ‘శివాజీ’, ‘ఐ’ వంటి ఎన్నో సినిమాల్లో ఆయన పాటలు విజువల్ వండర్స్. ఇప్పుడు చరణ్ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. న్యూజిలాండ్‌లోని వివిధ లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరించనున్నారు. ఈ ఒక్క పాట కోసం దిల్ రాజు రూ.8 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ కూడా దాటిపోయిందని సమాచారం. మొత్తం బడ్జెట్లో యాభై శాతం షూటింగ్‌కే వెచ్చించానని శంకర్ తెలిపాడు. మరి ఆయనతో సినిమా అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. ఈ విషయం దిల్ రాజుకు కూడా తెలుసు. అందుకే బ డ్జెట్ మించిపోతున్నా.. ఏమీ మాట్లాడ డం లేద ని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.