గాడ్ ఫాదర్ రిజల్ట్ పై సల్మాన్ ఖాన్ రియాక్షన్
గాడ్ ఫాదర్ రిజల్ట్ పై సల్మాన్ ఖాన్ రియాక్షన్

చిరంజీవి, సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. సినిమా చూసిన ప్రేక్షకులంతా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. హిందీలో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.

g-ప్రకటన

గాడ్ ఫాదర్ మొదటి రోజు 16 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయగా, మొదటి వారాంతం నాటికి ఈ చిత్రం 70 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసే అవకాశం ఉంది.
చిరంజీవి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. తాజాగా సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ రిజల్ట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సల్మాన్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోను పంచుకున్నాడు మరియు ఆ వీడియోలో “మై డియర్ చిరు గారూ ఐ లవ్ యు” అని చెప్పాడు.

గాడ్ ఫాదర్ సినిమా బాగా వస్తోందని విన్నాను, అభినందనలు అంటూ సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. గాడ్ బ్లెస్ యూ అంటూ సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోకు 15 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. సల్మాన్ ఖాన్ పోస్ట్ ను మెగా హీరో రామ్ చరణ్ లైక్ చేయడం గమనార్హం. గాడ్ ఫాదర్ సినిమా హిందీలో కూడా విజయం సాధించి ఉంటే బాగుండేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

గాడ్ ఫాదర్ సినిమా ఫుల్ రన్ లో 150 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార, సత్యదేవ్ తమ నటనతో ఆకట్టుకోవడం గమనార్హం. చిరంజీవి సినిమా రేంజ్ పెరుగుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *