అలాంటి పాత్రలో సందడి చేసేందుకు సమంత రెడీ!
అలాంటి పాత్రలో సందడి చేసేందుకు సమంత రెడీ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత వరుస సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్‌కి కాస్త విరామం ఇచ్చినప్పటి నుంచి సమంతకు సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా సమంత సినిమాలకు సంబంధించిన ఓ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. త్వరలో ఆమె తన కొత్త ప్రాజెక్ట్ షూటింగ్‌లో బిజీ కానుందని తెలుస్తోంది.

g-ప్రకటన

కానీ ఆమె సినిమా కాకుండా వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొనబోతోందని సమాచారం. ఇప్పటికే ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈమె మరో వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. హాలీవుడ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’కి రీమేక్‌గా రాజ్‌, డీకే ఈ వెబ్‌ సిరీస్‌ని రూపొందిస్తున్నారు.

ఈ క్రమంలో సమంత ఏజెంట్ గా సందడి చేయబోతున్నట్లు సమాచారం. ఫుల్ యాక్షన్ ప్యాక్‌గా ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం సమంత ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంది. ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ తో కలిసి సమంత సందడి చేయనుంది. హాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రియాంక చోప్రా ఈ వెబ్ సిరీస్‌లో నటిస్తుండగా తెలుగులో సమంత నటిస్తోంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ప్రారంభం కానుందని సమాచారం. ఇవే కాకుండా యశోద, ఖుషి, శాకుంతలం వంటి సినిమాలతో సమంత బిజీగా ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *