కేవలం శాంపిల్ మాత్రమే అంటూ డైలాగ్ లీక్ చేశాడు దర్శకుడు
కేవలం శాంపిల్ మాత్రమే అంటూ డైలాగ్ లీక్ చేశాడు దర్శకుడు

‘అఖండ’ బ్లాక్‌బస్టర్‌తో దూసుకుపోతున్న బాలయ్య, ‘క్రాక్’తో ట్రాక్‌లోకి వచ్చిన గోపీచంద్ మలినేని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రానికి ‘వీరసింహారెడ్డి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ‘గాడ్ ఆఫ్ మాస్’ అనే సాలిడ్ ట్యాగ్‌లైన్ పెట్టి ఫ్యాన్స్‌లో ఫుల్ ఉత్సాహాన్ని నింపారు మేకర్స్. ఈ సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమం కర్నూల్ కొండా రెడ్డి బురుజు దగ్గర బాలయ్య అభిమానులు, కర్నూలు ప్రజలు మరియు చిత్ర యూనిట్ మధ్య అత్యంత వైభవంగా జరిగింది.

g-ప్రకటన

టైటిల్‌తో కూడిన పోస్టర్‌ను చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అంతేకాదు సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పడంతో టీమ్ ఆనందాన్ని రెట్టింపు చేసింది. స్వయంగా బాలయ్య బాబు అభిమాని అయిన దర్శకుడు గోపీచంద్ చాలా ఎమోషనల్ గా మాట్లాడి అభిమానుల కళ్లలో అంచనాలు పెంచేశాడు. అభిమానుల కోరిక మేరకు గోపీచంద్ సినిమాలోని ఓ డైలాగ్ చెప్పాడు.

ఇదీ ‘వీరసింహారెడ్డి’.. అభిమానులంతా పండగ చేసుకునే సినిమా.. ‘సమరసింహారెడ్డి’ ఎలాంటి వైబ్రేషన్‌ని ఇచ్చిందో.. మళ్లీ అలాంటి వైబ్రేషన్‌నే ఈ ‘వీరసింహారెడ్డి’ ఇస్తుంది. సంక్రాంతికి ‘వీరసింహా రెడ్డి’ విజృంభించనుంది.. ఇంకా 20 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది.. ఇప్పుడు రిలీజ్ అయినా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది..

సినిమాలో చాలా అంశాలు ఉన్నాయి.. ‘వీరసింహా రెడ్డి’.. పులిచెర్లలో పుట్టి.. చదివింది అనంతపురం.. కర్నూలును శాసించేది”.. అంటూ సినిమాలోని పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి అభిమానులను అలరించారు దర్శకుడు గోపీచంద్ మలినేని.. బాలయ్య అభిమానులు. 2023 సంక్రాంతి సంబరాలను రెట్టింపు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *