నిహారిక టర్కీ టూర్ డైరీలు.. వైరల్ అవుతున్న వీడియో..!
నిహారిక టర్కీ టూర్ డైరీలు.. వైరల్ అవుతున్న వీడియో..!

మెగా డాటర్ నిహారిక వారం పది రోజులుగా టర్కీలో ఉంది. రీసెంట్ గా టర్కీ అమ్మాయితో కలిసి స్విమ్మింగ్ పూల్ లో దిగిన ఫోటోని షేర్ చేసిన సంగతి తెలిసిందే. నిహారిక బికినీలో కనిపించడంతో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ మధ్య కాలంలో వరుస టూర్లను ఎంజాయ్ చేస్తున్న నిహారిక చాలా కాలంగా టర్కీలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆమె అక్కడి నుంచి రాలేకపోయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది.

g-ప్రకటన

ఇంకా అలసిపోలేదు’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్‌ను పోస్ట్ చేసింది. ఆమె టర్కీ పర్యటనలో ఆనందించిన అన్ని క్షణాలు ఇందులో ఉన్నాయి. ఆమె బికినీలో స్విమ్మింగ్ పూల్‌లోకి దూకిన దృశ్యాలు హైలైట్‌గా ఉన్నాయి. ఇప్పుడు ఆ రీల్ వైరల్‌గా మారింది. బుల్లితెరపై ఎన్నో షోలు, వెబ్ సిరీస్ ల ద్వారా కెరీర్ ప్రారంభించిన నిహారిక ఆ తర్వాత ‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్య కాంతం’, ‘సైరా నరసింహారెడ్డి’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.

అయితే ఇవేవీ ఆమెకు విజయాన్ని అందించకపోవడంతో వెబ్ సిరీస్‌లలో నటించడం ప్రారంభించింది. ఆ తర్వాత లాక్ డౌన్, ఆమె పెళ్లి సంగతి అందరికీ తెలిసిందే. ఆమె 2020లో చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. కొంత కాలం గ్యాప్ తర్వాత నిహారిక మళ్లీ వెబ్ సిరీస్‌లను నిర్మించడానికి సిద్ధంగా ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *