'వారసుడు' ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్.. దిల్ రాజుకి వారసుడు అన్ని కోట్ల రూపాయలు వచ్చాయా?
‘వారసుడు’ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్.. దిల్ రాజుకి వారసుడు అన్ని కోట్ల రూపాయలు వచ్చాయా?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు నిర్మించిన మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. ఓ వైపు నిర్మాతగా, మరోవైపు డిస్ట్రిబ్యూటర్‌గా దిల్ రాజు తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. విజయ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాణంలో వారసుడు అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తమిళంలో వారిసు అనే టైటిల్‌తో విడుదల చేయడం గమనార్హం. వారసుడు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

g-ప్రకటన

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జనవరి 12, 2023న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రముఖ OTTలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను 60 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ 50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా హిందీ, ఓవర్సీస్ రైట్స్ 70 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు సమాచారం.

ఈ సినిమా ఆడియో రైట్స్ 10 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇతర భాషల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 200 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడుపోయే ఛాన్స్ ఉంది. వారసుడు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 400 కోట్ల రూపాయల వరకు జరిగే అవకాశం ఉంది.

ఈ సినిమా ద్వారా నిర్మాత దిల్ రాజు మొత్తం 100 కోట్ల రూపాయలకు పైగా లాభం పొందే అవకాశం ఉందని కామెంట్స్ సూచిస్తున్నాయి. దిల్ రాజు సినీ కెరీర్ లో భారీ లాభాలను మిగిల్చిన సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *