డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి డిజాస్టర్ సినిమాలతో విజయ్ దేవరకొండ కెరీర్‌కు ఊహించని బ్రేక్ పడింది. అయితే తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా భారీ అంచనాల నడుమ విడుదలైన ‘లైగర్’ కూడా డిజాస్టర్‌గా నిలిచింది. మరి ఇప్పుడు విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నాడనేది ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈసారి మంచి కమ్‌బ్యాక్ ఇస్తాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే హరీష్ శంకర్ చేతిలో ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “భవదీయుడు భగత్ సింగ్” సినిమా ఉంది.

అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా పదే పదే వాయిదా పడుతూ వస్తోంది. గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో కూడా ఈ కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి.

నిన్న జరిగిన శివ కార్తికేయన్ ప్రిన్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి హరీష్ శంకర్, విజయ్ దేవరకొండ ఇద్దరూ హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ తన ప్రసంగంలో దర్శకుడు హరీష్ శంకర్‌తో పాటు సంగీత దర్శకుడు ఎస్ థమన్‌తో కలిసి పనిచేయాలనే కోరికను వ్యక్తం చేశాడు. విజయ్ దేవరకొండ శివ కార్తికేయన్ గురించి మాట్లాడుతూ కొన్ని భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. తాము ఎప్పుడూ వ్యక్తిగతంగా కలుసుకోలేకపోయినా, శివ కార్తికేయన్ ప్రయాణం తనకు చాలా ఇష్టమని చెప్పాడు.

ఈ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ కూడా విజయ్ దేవరకొండ గురించి మాట్లాడాడు. ఇది మరో రూమర్‌కి దారి తీస్తుందని విజయ్ గురించి మాట్లాడేందుకు భయపడుతున్నానని అన్నారు. తనపై, విజయ్ దేవరకొండపై చాలా రూమర్స్ వచ్చాయని సరదాగా చెప్పాడు.

శివకార్తికేయన్ నటించిన ‘ప్రిన్స్’ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదల కానుంది. ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ ఈ చిత్రానికి దర్శకుడు. నిన్న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *