ఆర్‌ఆర్‌ఆర్‌తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజమౌళి. ఈ తరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఒకే సినిమాలో సూపర్బ్ కాంబినేషన్ సీన్స్ తో చూపించి ఇద్దరు హీరోల అభిమానులకు మరిచిపోలేని ట్రీట్ ఇచ్చిన రాజమౌళి హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు. వచ్చే ఏడాది లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఆస్కార్ అవార్డు వేడుకలో ‘RRR’ అనేక విభాగాల్లో నామినేషన్లు పొందేలా దర్శకుడిగా తన పేరును ప్రపంచవ్యాప్తం చేయడానికి రాజమౌళి ప్రయత్నిస్తున్నారు.

RRR వంటి భారీ ప్యాన్ ఇండియా వండర్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు మరియు అతని అభిమానులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

యాక్షన్‌-అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కథను లాక్ చేసిన రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందనుంది. అయితే యదార్థ సంఘటనల సమాహారంగా ఈ సినిమా రూపొందనుందని తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా రూపొందిందని ధృవీకరించారు. ఇప్పుడు ఈ వార్త విన్న తర్వాత, అంచనాలు పెరగడం ఖాయం. ఈ చిత్రం 2023లో సెట్‌పైకి వెళ్లనుంది మరియు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అంతే కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ హాలీవుడ్ హీరోల రేంజ్ లో సరికొత్త మేకోవర్ తో కనిపించనున్నాడు.

ఫిజికల్ గా రాజమౌళి సినిమాల్లో హీరోలు ఎప్పుడూ ఫిట్ గా ఉంటారు. అదే బాటలో మహేష్ కూడా ఫిజికల్ గా కొత్త మేకోవర్ తో కనిపిస్తాడని అంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది భారీ ఎత్తున ప్రారంభం కానుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *