త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్‌ని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా చూపిస్తాడా?
త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్‌ని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా చూపిస్తాడా?

మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో విడుదలైన అవ, ఖలేజా చిత్రాలు భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయాయి. అయితే మహేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ ఈ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా సక్సెస్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. క్లాస్ మూవీగా త్రివిక్రమ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని, అయితే మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు కూడా ఈ సినిమాలో ఉంటాయని వ్యాఖ్యానాలు వ్యక్తం అవుతుండడం గమనార్హం.

g-ప్రకటన

ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయింది. మహేష్ తొలిసారి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపించనుండడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాకు అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో పది రోజుల తర్వాత ఈ సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎమోషనల్ సీన్లకు కూడా ప్రాధాన్యత ఉంటుందని బోగట్టా.

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై మహేశ్ త్రివిక్రమ్ కాంబోలో భారీ బడ్జెట్‌తో సినిమా రూపొందుతోంది. దాదాపు 150 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతుండటం గమనార్హం. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ లెవెల్ లో ఉండేలా త్రివిక్రమ్ శ్రీనివాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు బోగట్టా.

ఈ సినిమాలో ఇతర భాషల నటీనటులకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించే ప్రాజెక్ట్స్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *